హర్యానాలో ఇద్దరు అధికారులు కుమ్మక్కయ్యారు! అదెలాగో చూడండి. హర్యానాలో రైట్ టు సర్వీస్ కమిషన్ పేరిట 2013లో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కమిషన్ అన్న తర్వాత కమిషనర్లు ఉండాలి కదా. ఇలాంటి ప్రత్యేక సంఘాలకు కమిషనర్లంటే కొన్ని అదనపు సౌకర్యాలు, హోదా లభిస్తాయి. పదవీ విరమణ అనంతరం కూడా ఇలాంటి కమిషన్లలో కొనసాగే వెసులుబాటు ఉంటుంది. అందుకే టాప్ బ్యూరోక్రాట్లందరూ ఇటువైపు వచ్చేందుకు మొగ్గుచూపుతారు. అందుకు హర్యానా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సీ.చౌధరి, అదనపు ప్రధాన కార్యదర్శి సర్బన్ సింగ్ లు మినహాయింపేమీ కాదు.
తొలుత కమిషన్ సభ్యుడిగా సర్బన్ సింగ్ ను నియమించాలంటూ ప్రభుత్వానికి ఎస్.సీ.చౌధరి సూచించారు. అనంతరం సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కాస్తా.... కమిషన్ చైర్మన్ గా ఎస్.సీ.చౌధరిని నియమించాలని సర్కారుకు సిఫారసు చేసింది. వీరనుకున్నట్టే జరిగింది. సర్బన్ సింగ్ రైట్ టు సర్వీస్ కమిషన్ లో కొలువుదీరగా, ఈనెల 31న ఎస్.సీ.చౌధరి పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన