మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం యూపీఏ సర్కారు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ద్రోహం చేసిందనే వార్తలు వెల్లువెత్తాయి. భారతరత్న అవార్డుకు అర్హుల ఎంపికలో మన్మోహన్ సింగ్ సర్కారు తన విశ్వసనీయతకు తీవ్ర విఘాతం కలిగించుకునేలా వ్యవహరించిందని 'హెడ్ లైన్స్ టుడే' ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించడంతో యావత్ భారతావని నివ్వెరపోయింది.
అప్పటిదాకా క్రీడాకారులకు భారతరత్న పురస్కారం ఇచ్చే సంప్రదాయం లేదు. హాకీలో మూడుసార్లు భారత్ కు ఒలింపిక్స్ బంగారు పతకాలను సాధించిపెట్టిన ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి పలు క్రీడా సంఘాలతో పాటు ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో... యూపీఏ ప్రభుత్వం భారతరత్న గ్రహీతల జాబితాలో క్రీడాకారులను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నపళంగా ధ్యాన్ చంద్ స్థానంలో సచిన్ పేరు చేర్చి గతేడాది పెద్ద చర్చకే తెరలేపింది. సచిన్ కూడా క్రికెట్ లో భారత్ ను సమున్నత స్థానంలో నిలిపిన నేపథ్యంలో నాడు దీనిపై అంతగా వివాదం చెలరేగలేదు.
తాజాగా హెడ్ లైన్స్ టుడే వెల్లడించిన కథనం ప్రకారం, భారతరత్న అవార్డుల ప్రకటన వెలువడటానికి రెండు రోజుల ముందు వరకు కూడా క్రీడాశాఖ మంత్రి జితేంద్రసింగ్ పంపిన సిఫారసుల మేరకు సీఎన్ఆర్ రావుతో పాటు ధ్యాన్ చంద్ పేరే ఉంది. అయితే సరిగ్గా రెండు రోజుల ముందు సచిన్ పూర్తి వివరాలను సాయంత్రంలోగా పంపాలని కేంద్ర క్రీడాశాఖను ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించింది. సదరు శాఖ నుంచి వివరాలను అందుకున్న మరుక్షణమే ద్యాన్ చంద్ పేరు స్థానంలో సచిన్ పేరు చేరిపోయింది.
అసలు భారతరత్న పురస్కార గ్రహీతల విభాగంలో క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నదే ధ్యాన్ చంద్ కోసమైతే, చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించడం ఆ హాకీ మాంత్రికుడికి ద్రోహం చేసినట్లు కాకపోతే మరేంటనేది సగటు భారతీయుడి ప్రశ్న. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వెలుగు చూసిన ఈ కథనంపై పెద్ద ఎత్తున విమర్శలు రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన