ఆగస్టు 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో భూముల విలువ 30 శాతం మేర పెరగనుంది. దీనికి సంబంధించిన దస్త్రంపై ఇప్పటికే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంతకం చేశారు. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ పై ఉంది. ఆయన సంతకం చేయగానే భూముల సరికొత్త విలువలు అమల్లోకి వస్తాయి. అయితే ప్రస్తుత పెంపు నగరాలు, పట్టణాలకే వర్తించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది ఎలాంటి పెంపు ఉండదు.
ప్రస్తుతం సీమాంధ్రలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రియలెస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి తదితర నగరాల్లో భూముల ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. కృత్రిమంగా పెరుగుతున్న ధరలను కూడా సంబంధిత శాఖ పరిగణనలోకి తీసుకుంది. దీంతో 30 శాతం మేర భూముల విలువను పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే భూముల విలువ పెంపుకు సంబంధించిన ముసాయిదాలు సిద్ధం చేసి అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ క్షణంలోనైనా సంతకం చేసే అవకాశం ఉంది. దీంతో, పెరిగిన భూముల విలువ ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన