జన్యు మార్పిడి పంటలకు భారత్ లో నూకలు చెల్లినట్టే కనిపిస్తోంది. జన్యు మార్పిడి పంటలకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశోధనలను నిలుపుదల చేయాలంటూ ఆరెస్సెస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం పునరాలోచనలో పడిపోయింది. జన్యు మార్పిడి పంటల ప్రయోగాలకు సంబంధించిన విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. అంతేకాక ఈ విషయంపై తొందరపాటుతో కూడిన నిర్ణయం ఉండదని కూడా ఆయన తేల్చిచెప్పారు.
దేశంలో ప్రధాన పంట వరితో పాటు వంగ, శనగలు, ఆవాలు, పత్తి తదితర పంటలకు సంబంధించి జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతివ్వాలని పలు సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించడానికి జెనెటిక్ ఇంజినీరింగ్ ఆమోద కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కమిటీ పలు జన్యు మార్పిడి పంటలకు సంబంధించి క్షేతస్థాయి ప్రయోగాలకు అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జన్యు మార్పడి పంటలకు అనుమతి మంజూరు చేయరాదని వాదించిన సంగతి తెలిసిందే.
తాజాగా బీజేపీ అధికార పగ్గాలు చేపట్టడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థలుగా కొనసాగుతున్న స్వదేశీ జాగారణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు జన్యు మార్పిడి పంటల పై సుదీర్ఘంగా చర్చించారు. జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే నష్టాలు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ నివేదిక తదితరాలను ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జన్యు మార్పిడి పంటలకు తలుపులు తెరవొద్దని వారు మంత్రిని కోరారు.
దీంతో పునరాలోచనలో పడ్డ మంత్రి, దీనిపై మరింత లోతుగా పరిశీలన చేసిన మీదటే నిర్ణయం తీసుకుంటామని సదరు సంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆరెస్సెస్ భావజాలం నిండిన బీజేపీ, దాని అనుబంధ సంస్థల మాటకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం సాధారణమే. ఇదే జరిగితే, జన్యు మార్పిడి పంటల ప్రయోగాలతో పాటు పంటల సాగు దాదాపుగా అటకెక్కడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన