భారత దేశంలో అతిపెద్ద 'ఈ కామర్స్' సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీగా నిధులను సమీకరించుకుంది. ఆన్ లైన్ వ్యాపార రంగంలో తలెత్తిన పోటీని తట్టుకునేందుకు కొత్త ఇన్వెస్టర్లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ కారణంగా ఫ్లిప్ కార్ట్ ఒక బిలియన్ డాలర్లను (6 వేల కోట్ల రూపాయలు) నిధిగా సమీకరించుకుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ విలువ అమాంతం 7 బిలియన్ డాలర్లకు (42 వేల కోట్ల రూపాయలు) చేరుకుందని భావిస్తున్నారు.
నూతన ఇన్వెస్టర్లలో టైగర్ మేనేజ్ మెంట్ అండ్ నాస్పర్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ, ఎక్సెల్ పార్టనర్, డీఎస్టీ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, సొఫినా సంస్థలు ఉన్నాయని సమాచారం. తాజాగా సమకూర్చుకున్న నిధులతో ఫ్లిప్ కార్ట్ మొబైల్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ విభాగాల్లో ఖర్చుచేయనుంది. కాగా, ఫ్లిప్ కార్ట్ బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తోంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన