మొబైల్ లో నెట్ వాడే వినియోగదారులకు కొత్త సౌకర్యంతో గాలమేసేందుకు ఫేస్ బుక్ రంగం సిద్ధం చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగం తగ్గుతుండడానికి తోడు... భారతదేశంలో ఫేస్ బుక్ వినియోగం పెరుగుతుండడంతో కొత్త సౌకర్యంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. మొబైల్ లో ఫేస్ బుక్ వినియోగిస్తున్నా కావాల్సిన వాటిని సేవ్ చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ఫోన్ కంటే కంప్యూటర్ పైనే ఎక్కువ మంది ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు.
దీంతో ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలో ఫేస్బుక్ ను ఉపయోగిస్తుంటే ఇక నుంచి ‘సేవ్’ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వినియోగదారులకు వీలు కుదిరినప్పుడు చూసుకునే విధంగా వాటి లింకుల్ని ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. తరువాత విరామ సమయాల్లో వాటిని ఎంచక్కా వీక్షించవచ్చు. అలా సేవ్ చేసుకున్న లింకులు మీకు తప్ప ఇంకెవరికీ కనిపించకుండా ఉండేలా దానిని ఫేస్ బుక్ రూపొందించనుంది.
అలా కాదనుకుంటే ఆ లింకులను ఆర్చీవ్ లో సేవ్ చేసుకోవచ్చు, లేదా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షనును అతిత్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ఫేస్ బుక్ స్పష్టం తెలిపింది. అలా సేవ్ చేసుకున్న లింక్స్ ను చూడాలంటే ఎడమవైపున ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన