23 లక్షల ఎకరాల ఆయకట్టును చూపించారు... కానీ కాల్వలు తవ్వలేదు: చంద్రబాబు

28-07-2014 Mon 19:30
23 లక్షల ఎకరాలకు పైగా అదనపు ఆయకట్టును లెక్కల్లో చూపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కానీ, అది కాగితాలకే పరిమితమైందని ఆయన అన్నారు. లెక్కల్లో చూపించారు కానీ కాల్వలు తవ్వలేదని ఆయన చెప్పారు. గత పదేళ్లుగా ఎన్ని తప్పులు చేయాలో... అన్ని తప్పులను చేశారని బాబు మండిపడ్డారు. టీడీపీ హయాంలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు. కానీ వాటినన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని అన్నారు. సాగునీటి సంఘాలతో సత్ఫలితాలు వచ్చాయని అన్ని సర్వేలు చెప్పాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ లకు 9 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తే శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని, కానీ అలా జరగలేదన్నారు. కొన్ని ప్రాజెక్టులకు భూసేకరణ ఇంతవరకు జరపలేదన్నారు. దానివల్ల ప్రాజెక్టు అంచనాలు కోట్లాది రూపాయల మేర పెరిగిపోయాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టు తీసుకొచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు తప్ప ఒక్క ప్రాజెక్టును పూర్తిచేయలేదని ఆయన చెప్పారు. ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులన్నింటినీ ఒకేసారి ప్రారంభించారని, ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకున్నారని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల పుణ్యమా అని కాంగ్రెస్ పెద్దలంతా జలయజ్ఞం పేరుతో లాభపడ్డారని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులను మొదలుపెట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టుల పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టును వెంటనే చేపట్టాల్సి ఉందని, ఆ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు చెప్పారు. నదీ జలాల వినియోగం పైన అపెక్స్ కమిటీలు వచ్చాయని, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచకుండా అడ్డుకున్నామని ఆయన అన్నారు.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more