గుజరాత్ విద్యాశాఖ ఓ విషయంలో అభాసుపాలైంది. అక్కడి పాఠ్య పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని విషయాలు తప్పుల తడకలుగానూ, వాస్తవదూరంగా ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే నవ్వు రాక మానదు. జపాన్ దేశం రెండో ప్రపంచయుద్ధం సందర్భంగా అమెరికాపై అణు దాడి జరిపిందట. వాస్తవానికి అమెరికానే జపాన్ పై అణు బాంబులేసింది.
ఇక, భారత దేశ విభజన అనంతరం ఏర్పడిన దేశం 'ఇస్లామిక్ ఇస్లామాబాద్' గా పేర్కొన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా... కౌరవులు స్టెమ్ సెల్ థెరపీతో పుట్టారని ఆ పుస్తకాల్లో పొందుపరచడం దారుణం. ఈ వరుసలోనే మోటార్ కారు వేద కాలంనాడే ప్రాచుర్యంలో ఉందని పేర్కొన్నారు. ఆ కారును అప్పట్లో అనాశ్వరథ్ అని పిలిచేవారట. అంటే గుర్రాలు లేని వాహనం అని అర్థం. చివరిగా... భారతదేశానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన మహాత్మాగాంధీ అక్టోబర్ 30, 1948లో హత్యకు గురయ్యాడని రాశారు. వాస్తవానికి గాంధీ చనిపోయింది 1948 జనవరి 30న. అక్కడి ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసిన సప్లిమెంటరీ పుస్తకాల్లో ఇంకా ఎన్నో తప్పులున్నాయి.
వీటిపై గుజరాత్ విద్యా శాఖ మంత్రి భూపేంద్ సింహ్ చుడాసమా వివరణ ఇస్తూ... ఈ పుస్తకాలు కేవలం రిఫరెన్స్ కోసమేనని, భారతీయ సంస్కృతిని విద్యార్థులకు పరిచయం చేసేందుకు ఉద్దేశించినవని తెలిపారు. ఇవి సిలబస్ లో భాగం కాదని పేర్కొన్నారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన