ఫేస్ బుక్ ఓ టెక్కీ కొంపముంచింది. సరదాగా ప్రారంభించిన ఛాటింగ్ ఆమెను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టింది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని భావనగర్ ప్రాంతానికి చెందిన రిషభ్ కతోడియా (25) ఇండోర్ లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫేస్ బుక్ లో ఇండోర్ ప్రాంతానికి చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (23)ను పరిచయం చేసుకుని ఛాటింగ్ చేసేవాడు. పరిచయం కాస్త పెరిగాక జనవరి 4న ఇండోర్ వచ్చి సైట్ సీయింగ్ కి తీసుకెళ్లాడు.
తరువాత కాఫీ తాగేందుకు హోటల్ గదికి ఆహ్వానించి అక్కడ కాఫీలో మత్తుమందు కలిపి మొబైల్ ఫోన్ లో అసభ్యంగా వీడియో తీశాడు. రెండు నెలల తరువాత ఫోన్ చేసి వడోదరలో గతంలో తామున్న ప్రాంతానికి రావాలని, లేని పక్షంలో తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడతానని భయపెట్టాడు. దీంతో అతను సూచించిన ప్రాంతానికి వెళ్లిన ఆమెను మూడు రోజులపాటు పలుమార్లు అత్యాచారం చేశాడు.
తరువాత కొంత కాలానికి ఆమె అసభ్య ఫోటోలు ఆమెకే పంపి తనను పెళ్లి చేసుకోవాలని... లేని పక్షంలో ఆ ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. తన మాట కాదంటే చంపుతానని బెదిరించసాగాడు. ఆ కీచకుడి బాధ భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై అత్యాచారం, మోసం, కుట్రపూరితంగా మహిళ పట్ల వ్యవహరించడం, ఐటీ యాక్ట్ వంటి సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన