ఎంసెట్ ను రద్దు చేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం!
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కౌన్సెలింగ్ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంజినీరింగ్, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు తరహాలో ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా ఇంజినీరింగ్, మెడిసిన్ అడ్మిషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దానిపై అధ్యయనం కోసం తాజాగా కమిటీని నియమించింది. వారంలోగా ఈ కమిటీ ఓ నివేదిక ఇవ్వనుంది.