ఎంసెట్ కౌన్సెలింగ్ కేసులో కౌంటరు దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి గడువు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంసెట్ కౌన్సెలింగ్ కేసులో కౌంటరు దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి గడువు

ఎంసెట్ కౌన్సెలింగ్ కేసులో కౌంటరు దాఖలు చేసేందుకు ఏఐసీటీఈ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ గడువు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం నేడు విచారణ చేపట్టింది. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ వాదనలు కూడా వినాలనుకున్న న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. అటు కౌన్సెలింగ్ మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోంది.

More Telugu News