Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూరలు రుచి తగ్గుతున్నాయ్... కారణమేంటో తెలుసా?

గత కొన్ని రోజులుగా కూరల్లో రుచి తగ్గుతోంది, కారణమేంటని ఇప్పుడు భర్తలు... భార్యల్ని ప్రశ్నిస్తున్నారు. కారణమేంటో తెలుసా..? టమోటాల ధరలు ఆకాశాన్నంటుతుండడమే. కేజీ రూ.60 నుంచి రూ.80 రూపాయలు పలుకుతుండగా, టమోటాలు కొనడం బాగా తగ్గిపోయింది. "ధరలు ఇలా మండిపోతుంటే ఇంకే కొంటాం, కూరల్లో ఎలా వేస్తాం?" అని మహిళలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టమోటాలు కేజీ రూ.100 చేరడం ఖాయమని పలువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉల్లితోపాటు టమోటా దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది.

More Telugu News