ఈ పోలీస్ అధికారి జీతం ఫేస్ బుక్ చెల్లిస్తుంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ పోలీస్ అధికారి జీతం ఫేస్ బుక్ చెల్లిస్తుంది!

కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్ సిటీలో విధులు నిర్వర్తించే 34 ఏళ్ళ మహిళా పోలీస్ అధికారి మేరీ ఫెర్గుసన్ కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... ఆమెకు జీతం పోలీస్ విభాగం నుంచి కాకుండా ఫేస్ బుక్ నుంచి వస్తుంది. అంతేకాదండోయ్, కళ్ళు తిరిగే జీతం అది. సంవత్సరానికి రూ. 1 కోటి 16 లక్షలు ఆమె ఖాతాలో చేరతాయట. అయితే, అమెరికాలో ఆయా సంస్థలు పోలీసులకు జీతాలు చెల్లించడం పెద్ద విశేషమేకాదంటోంది వాల్ స్ట్రీట్ జర్నల్. 90వ దశకంలో పలు ఐటీ సంస్థలు పోలీస్ డిపార్ట్ మెంట్లోని కంప్యూటర్ క్రైమ్ సెల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేవట. ఇదిలా ఉంటే... మెన్లో పార్క్ లోని బెల్లె హెవెన్ ప్రాంతంలో ఫేస్ బుక్ తన హెడ్ క్వార్టర్స్ ను మరింత విస్తరించాలని భావిస్తోందని, అయితే, అక్కడ క్రైమ్ రేటు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో రక్షణ కోసం పోలీసులకు పెద్ద ఎత్తున జీతాలిస్తోందని స్థానికులు అంటున్నారు. దీంతో, తమను ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తారేమోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News