రాముడు తెలంగాణకు....రాముడి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాముడు తెలంగాణకు....రాముడి ఆస్తులు ఆంధ్రప్రదేశ్ కు!

పోలవరం బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంతో ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలు పూర్తిగా....రెండు మండలాలు పాక్షికంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం అవుతున్నాయి. అయితే ఈ విలీనం ప్రభావం భద్రాచలం శ్రీరాముడు మీద కూడా పడింది. దీని వల్ల భద్రాచలం శ్రీరాముడు తెలంగాణలో కొలువవుతుండగా....ఆయన ఆస్తులలో చాలాభాగం ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. ముంపు మండలాలను ఏపీలో కలపనుండడంతో భద్రాచలం ఆలయానికి సంబంధించిన జటాయువు మందిరం కూడా ఏపీలో కలవనుంది. ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రం సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. ఈ గ్రామం ఏపీలో కలవనుండడంతో జటాయువు మందిరం ఆంధ్రప్రదేశ్ సొంతం కానుంది. రామాయణంలో జటాయువు పాత్ర చాలా ముఖ్యమైనది. జటాయువు ఒక వయసు మళ్లిన గద్ద. రాముడి తండ్రి దశరధుడికి మిత్రుడు జటాయువు. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు పోతున్నప్పుడు.. రావణునితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రక్తసిక్త స్థితిలో సీతమ్మకోసం వెతుకుతున్న రాముడికి కనిపించి, రావణుడి వివరాలు చెప్పి వీరమరణం పొందుతాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా దాని దహన సంస్కారాలు చేస్తాడు.

More Telugu News