రుణాలపై వడ్డీ రద్దు చేయండి: పశ్చిమ బెంగాల్ సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రుణాలపై వడ్డీ రద్దు చేయండి: పశ్చిమ బెంగాల్ సీఎం

రైల్వేబడ్జెట్ సహా కేంద్ర సాధారణ బడ్జెట్ లోనూ తమ రాష్ట్రానికి కొత్తగా ప్రాజెక్టులేమీ దక్కలేదని, ఈ కారణంగా ఈ ఏడాది రాష్ట్రం ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదముందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రతికూల పరిస్థితుల నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు రుణాలపై వడ్డీ మాఫీ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తమకు ఇచ్చిన రుణాలపై కేంద్రం వడ్డీని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె కేంద్రానికి లేఖ రాశారు.

More Telugu News