Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం బిల్లుకు తెలంగాణ వ్యతిరేకం: కేకే

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. దానికి సంబంధించి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ముందుగా టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్ కు తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకమని తెలిపారు. చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పోలవరం ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

More Telugu News