ఆ గ్రామం కేరళనూ వెనక్కినెట్టింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ గ్రామం కేరళనూ వెనక్కినెట్టింది

సంపూర్ణ అక్షరాస్యత అంటే మనకు గుర్తొచ్చేది కేరళ రాష్ట్రమే. అయితే, జార్ఖండ్ లోని ఓ కుగ్రామం ఈ విషయంలో కేరళను సైతం అధిగమించింది. రామ్ గఢ్ జిల్లాలోని చత్తేర్ గ్రామం నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించింది. అంతేగాకుండా, అవీనితి రహిత గ్రామంగానూ ఆదర్శప్రాయంగా నిలిచింది. దాదాపు 1000 మంది జనాభా ఉన్న చత్తేర్ లో 35 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. దేశస్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క నేరమూ జరగలేదంటే, ఈ గ్రామస్థుల చైతన్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు! ఏదైనా సమస్య ఉంటే పెద్దల సమక్షంలో కూర్చుని చర్చించుకుంటారు. అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ఉమ్మడి నిధిని ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో గ్రామాలన్నీ చత్తేర్ లాంటి కుగ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే భారత్ పురోగామి పథంలో దూసుకెళ్ళడం ఖాయం.

More Telugu News