టీమిండియాకు కొరకరాని కొయ్యలా తయారైన రూట్
ట్రెంట్ బ్రిడ్జి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ (101 బ్యాటింగ్) సెంచరీ పూర్తిచేసుకున్నాడు. రూట్ కు సహకరించిన టెయిలెండర్ జేమ్స్ ఆండర్సన్ 37 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్లకు 392 పరుగులు కాగా, ఇంకా 65 పరుగులు వెనకబడి ఉంది. ధోనీ సేన తొలి ఇన్నింగ్స్ లో 457 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆటకు నేడు నాలుగవ రోజు.