Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘స్కాడా’ పథకం పైలట్ ప్రాజెక్టు కోసం ఏపీలోని నాలుగు జిల్లాలు ఎంపిక

విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్కాడా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. అందుకోసం రూ.100 కోట్ల నిధులను కేంద్ర ఇంధన వనరుల శాఖ కేటాయించింది. ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఇంధన వనరుల శాఖ తెలిపింది.

More Telugu News