ఇరాక్ బాధిత నర్సులకు చేయూతనిచ్చిన కేరళ
ఇరాక్ సంక్షోభం కారణంగా అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చిన 46 మంది కేరళ నర్సులకు అక్కడి ప్రభుత్వం చేయూతనిచ్చింది. కేరళ చేరుకున్న నర్సుల్లో 24 మందికి కేరళలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగాలు ఇప్పించారు. మిగిలిన వారికి విదేశాలకు వెళ్లేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. కాగా, 46 మంది నర్సులు అర్ధాంతరంగా ఉపాధి కోల్పోవడంతో ఇరాక్ ప్రభుత్వం వారికి 4 నెలల వేతనాన్ని భారత ఎంబసీకి అందజేసింది.