కేంద్రం నిర్ణయం సరికాదు... చూస్తూ ఊరుకుంటామా?: కేసీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రం నిర్ణయం సరికాదు... చూస్తూ ఊరుకుంటామా?: కేసీఆర్

పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరంపై కేంద్రం తీరు అప్రజాస్వామికమన్నారు. లోక్ సభలో ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో ఎలా కలుపుతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కేంద్రం నిర్ణయంపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సూచిస్తామని తెలిపారు. రాష్ట్రపతి కేంద్రం నిర్ణయాన్ని అడ్డకోకుంటే, అత్యున్నత న్యాయస్థానంలో కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేసీఆర్ చెప్పారు.

More Telugu News