ఐపీఎల్ లో నేటి వినోదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐపీఎల్ లో నేటి వినోదం

ఐపీఎల్ ఆరవ సీజన్ లో నేడు రెండు మ్యాచ్ లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ముంబయ్ వేదికగా 'ముంబయి ఇండియన్స్-పుణె వారియర్స్' జట్లు తలపడనున్నాయి. అనంతరం 8 గంటల నుంచి చెన్నై వేదికగా 'చెన్నై సూపర్ కింగ్స్- బెంగళూరు రాయల్స్' పోటీపడతాయి. కాగా, నిన్నరాత్రి 'ఢిల్లీ డేర్ డెవిల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్' మధ్య జరిగిన మ్యాచ్ లో రైజర్స్ జట్టు మూడోసారి విజయాన్ని దక్కించుకుంది. 8 వికెట్లకు ఢిల్లీ 114 పరుగులు చేస్తే, ఈ స్కోరును హైదరాబాద్ 7 వికెట్ల నష్టంతో అధిగమించి విజయాన్ని సాధించింది. కాగా, డేర్ డెవిల్స్ కు ఇది నాలుగో ఓటమి కావడం గమనార్హం.

More Telugu News