ప్రీతీజింటాతో వ్యాపారవేత్త నెస్ వాడియా ఘర్షణ వాస్తవమేనట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రీతీజింటాతో వ్యాపారవేత్త నెస్ వాడియా ఘర్షణ వాస్తవమేనట!

బాలీవుడ్ నటి ప్రీతీజింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా వ్యవహారంలో కొంతమందిని ముంబయి పోలీసులు విచారించారు. తాజాగా ఈ కేసులో ఐపీఎల్ 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్' ఆతిథ్యం విభాగ మేనేజర్ తారా శర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ప్రీతీ, నెస్ వాడియా మధ్య గొడవ వాస్తవమేనని తెలిపారు. మే 30న స్టేడియంలో సీట్ల కేటాయింపుపై వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదన జరిగిందని ఆమె వెల్లడించారు. అదే సమయంలో తనపైనా నెస్ అరిచారని చెప్పారు. ఈ వాంగ్మూలాన్ని రెండు రోజుల కిందట (గురువారం) నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

More Telugu News