భారత సంతతి గ్యాంగ్ లీడర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత సంతతి గ్యాంగ్ లీడర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష

భారతీయ సంతతికి చెందిన గ్యాంగ్ లీడర్ విశాల్ చౌదరి (35)కి మహిళల అక్రమ రవాణా కేసులో బ్రిటన్ కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాదాపు 100 మందికిపైగా మహిళలను బ్రిటన్ తరలించడమే కాకుండా, వారితో బలవంతంగా వ్యభిచారం చేయించినట్టు విశాల్ పై నేరం రుజువైందని న్యాయస్థానం పేర్కొంది. విశాల్ తో పాటు అతడికి సహకరించిన నలుగురికి లండన్ కోర్టు జైలు శిక్ష ఖారారు చేసింది.

విశాల్ సోదరుడు కునాల్ చౌదరికి 5 సంవత్సరాలు, మహిళ సిజల్వియా అబెల్ కు 3 సంవత్సరాలు, ఆమె సోదరుడు క్రిస్జిటియన్ అబెల్ కు పదేళ్ల జైలు శిక్ష, అటిల్లా కోవాస్ కు 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వీరందరినీ గతేడాది ప్రారంభంలో పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News