800 భాషలు మాట్లాడే నగరం కథ కమామీషు
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 800 భాషలు మాట్లాడే ప్రజలున్నారు. 1790కి ముందు అమెరికా రాజధానిగా ఉన్న న్యూయార్క్ రెట్రో సిటీగా మారిపోవడంతో, పరిపాలనకు, ప్రజలకు ఆటంకం కలుగకుండా అమెరికా రాజధానిగా వాషింగ్టన్ డీసీని చేశారు. న్యూయార్క్ నగరంలో చైనీయుల జనాభా ఎక్కువగా ఉంటుంది... అందుకే వారు నివసించే ప్రాంతాన్ని చైనా టౌన్ అని అంటారు. అమెరికాలోని మిగిలిన నగరాల్లో కూడా చైనీయుల జనాభా అధికంగానే ఉంటుంది.
న్యూయార్క్ నగరానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే నగరం న్యూయార్క్. ప్రతి యేటా ఈ నగరాన్ని సందర్శించేందుకు 49 మిలియన్ల విదేశీ యాత్రికులు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. టూరిజం ద్వారా న్యూయార్క్ కు భారీ ఆదాయం సమకూరుతోంది. న్యూయార్క్ నగరానికి ప్రధాన ట్రాన్స్ పోర్టు భూగర్భరైళ్లు.
బ్రోనిక్స్, బ్రూక్లిన్, మన్ హట్టన్, క్వీన్స్, స్టేటెడ్ ఐలాండ్ అనే ఐదు ద్వీపాలను కలపి న్యూయార్క్ నగరాన్ని నిర్మించారు. న్యూయార్క్ లో ప్రప్రంచ ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎల్లీస్ ఐలాండ్, సెంట్రల్ పార్క్, వాల్ స్ట్రీట్, బ్రూక్లిన్ బ్రిడ్జి, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఉన్నాయి.
టైమ్ స్క్వేర్ లో 24 గంటలూ జనం ఉంటారు. ముంబైలానే న్యూయార్క్ ను కూడా నిద్రపోని నగరం అంటారు. టైమ్ స్క్వేర్, ఎంపైర్ బిల్డింగ్, షాపింగ్ మాల్స్, పబ్బులు, క్లబ్బులు ఒకటేమిటి భూలోకంలో గంధర్వనగరంలా ఉంటుంది.