పోలీసుల ఫిట్ నెస్ బాగుంటేనే... బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు: డీసీపీ కమలాసన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల ఫిట్ నెస్ బాగుంటేనే... బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు: డీసీపీ కమలాసన్ రెడ్డి

పోలీసులు ఫిట్ నెస్ ను కాపాడుకోవాలని, అప్పుడే బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలుగుతారని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. ఫిట్ నెస్ పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన చెప్పారు. నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో సెంట్రల్ జోన్ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇవాళ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కు హాజరైన డీసీపీ కమలాసన్ రెడ్డి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ... విధి నిర్వహణలో ఎవరినీ ఉపేక్షించవద్దని చెప్పారు.

More Telugu News