నన్నపనేని అల్లుడికి తీవ్రగాయాలు... పరిస్థితి ఆందోళనకరం
తెలుగుదేశం పార్టీ నేత నన్నపనేని రాజకుమారి అల్లుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి-నల్గొండ జిల్లాల సరిహద్దులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. నన్నపనేని అల్లుడితో పాటు డ్రైవర్ కూ తీవ్రగాయాలయ్యాయి. వీరిని హయత్ నగర్ సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.