విద్యుత్ పోరుపై వామపక్షాల పక్కా ప్రణాళిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విద్యుత్ పోరుపై వామపక్షాల పక్కా ప్రణాళిక

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, కరెంట్ కోతలపై పోరాటాన్ని వామపక్షాలు ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికను రూపొందించాయి. రెండో విడత జరగనున్న శాసనసభ సమావేశాల సందర్భంగా విద్యుత్ సమస్యలపై 'చలో అసెంబ్లీ' నిర్వహించనున్నారు. అంతేగాకుండా, పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో కూడా ఆందోళనలు చేయాలని వామపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఈనెల చివరివారంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాదులోని పార్టీ కార్యాయంలో జరిగిన భేటీలో వామపక్షాల నేతలు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

More Telugu News