మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వొద్దు: బీజేపీ ఎంపీలతో మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వొద్దు: బీజేపీ ఎంపీలతో మోడీ

బీజేపీ ఎంపీలకు శిక్షణ కార్యక్రమం ఈ ఉదయం హర్యానాలోని సూరజ్ కుండ్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోడీ తన పార్టీ ఎంపీలకు కర్తవ్యబోధ చేశారు. ప్రభుత్వంపై వేలెత్తి చూపే అవకాశం విపక్షాలకు ఇవ్వొద్దని కరాఖండీగా చెప్పారు. అవినీతికి తావివ్వరాదని, కుళ్ళు రాజకీయాలకు పాల్పడవద్దని సూచించారు. ప్రత్యర్థులతో జగడం కంటే పనికి ప్రాధాన్యం ఇవ్వాలని హితవు చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో మోడీతోపాటు సీనియర్ నేత అద్వానీ కూడా పాల్గొన్నారు.

More Telugu News