గాంధీ భవన్ ను నరకంగా మార్చేశారు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాంధీ భవన్ ను నరకంగా మార్చేశారు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

కాంగ్రెస్ పార్టీ పై ఆ పార్టీ నుంచి తాజాగా టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్లు గాంధీ భవన్ ను నరకంగా మార్చేశారని భూపాల్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో దోపిడీ దారులు, పైరవీకారులు ఎక్కువయ్యారని, ఇంకా పార్టీలో ఉంటే భవిష్యత్ ఉండదని పార్టీ మారానని రాజలింగం తెలిపారు. పదవులు ఆశించి టీఆర్ఎస్ పార్టీలోకి రాలేదని భూపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్ కు సహాయసహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చామని వారు తెలిపారు.

More Telugu News