సచిన్ తో పోల్చుకుంటున్న గోవా సీఎం
తాను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాణ్ణని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంటున్నారు. ఎప్పుడు ఏది చేయాలో అదే చేసే విషయంలో సచిన్ తో తనకు పోలిక ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయన సచిన్ ప్రస్తావన తేవడానికి కారణం గోవా ప్రతిపక్షాలేనట. గనుల తవ్వకాల్లో అవకతవకలకు పాల్పడ్డ మైనింగ్ కంపెనీల యాజమాన్యాల నుంచి పరిహారాన్ని వసూలు చేయాలని విపక్షాలు గోవా అసెంబ్లీలో పట్టుబట్టాయి. ముఖ్యమంత్రి తక్షణమే ఈ విషయమై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తాను సచిన్ లాంటి వాడినని ఎప్పుడేం చేయాలో అప్పుడే చేస్తానని కరాఖండీగా చెప్పేశారు.
ఈ సందర్భంగా పారికర్ మాట్లాడుతూ, 'నేను సలీమ్ దురానీ (మాజీ క్రికెటర్) లాంటి వాణ్ణి కాదు. అతను ప్రేక్షకులు సిక్స్ కొట్టమన్నప్పుడే కొట్టేవాడు. కానీ, సచిన్ అలాకాదు. ఏది ఎప్పుడు చేయాలో సరిగ్గా తెలిసిన వ్యక్తి సచిన్. సరైన సమయంలో సరైన పని చేస్తాడు. నేనూ అంతే' అని చెప్పుకొచ్చాడు. అదండీ... సచిన్ తో గోవా సీఎం పోలిక సంగతి!