Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యువతిపై అత్యాచారం చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన వారు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మహిళను కారులో తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు.

More Telugu News