హైదరాబాదులో ఐదుగురు ఏసీపీల బదిలీ
హైదరాబాదులో ఐదుగురు ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా ఎం.వెంకటేశ్వర్లు, సెంట్రల్ జోన్ ఓఎస్డీగా ఎం.రామ్మోహనరావు, డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ ఏసీపీలుగా బి.వరప్రసాద్, ఎంవీఆర్ శర్మ నియమితులయ్యారు.