రజనీకాంత్ స్థానంలో దేవుడు, రవీంద్ర జడేజాను సృష్టించాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీకాంత్ స్థానంలో దేవుడు, రవీంద్ర జడేజాను సృష్టించాడట!

భారత క్రికెట్ తాజా సంచలనం రవీంద్ర జడేజాపై ఇంటర్నెట్లో నవ్వు పుట్టించే కామెంట్లు నేటికీ తగ్గడంలేదు. వాటిలో కొన్నింటిని సహచర క్రికెటర్లే పోస్ట్ చేయడం విశేషం. వాటిల్లో కొన్ని ఇలా ఉన్నాయి.

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ముసలివాడయ్యాడని దేవుడు రవీంద్ర జడేజాను సృష్టించాడట.

సర్ రవీంద్ర జడేజా క్యాచ్ పట్టేందుకు పరిగెత్తాల్సిన పనిలేదట. బంతులే అతన్ని వెతుక్కుంటూ వచ్చి చేతుల్లో వాలతాయి!

జడేజా చేపలు పట్టాలంటే తన విజిటింగ్ కార్డులు అలా నీటిపై విసురుకుంటూ వెళతాడట. అప్పుడు చేపలు ఆ కార్డుల్లోని అడ్రస్ ను వెతుక్కుంటూ జడేజా ఇంటికి వచ్చేస్తాయి.

సర్ రవీంద్ర జడేజా తన చిన్నతనంలో ఆడుకునేందుకుని ఓ పర్వతం తయారుచేసుకున్నాడట. దాన్నే మనం నేడు మౌంట్ ఎవరెస్ట్ అని పిలుచుకుంటున్నాం.

సాయంత్రం మూడు గంటలకు ప్రాక్టీసు చేయాలనుకుంటే, స్టేడియమే సర్ రవీంద్ర జడేజా వద్దకు వస్తుంది.

సర్ రవీంద్ర జడేజా జీప్ డ్రైవ్ చేయాలనుకుంటే జీప్ స్థిరంగా ఉంటుంది. రోడ్డే వెనక్కి కదులుతుందట. అలాగే జడేజా బ్యాటింగ్ కు వెళ్ళాలన్నా పెవిలియన్ పిచ్ వద్దకు వెళుతుందట.

More Telugu News