Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాలమూరులో పరుగు ప్రారంభించిన వీవీఎస్

టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నేడు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో పాలమూరు పరుగును ప్రారంభించారు. అంతర్జాతీయ అథ్లెట్ శంకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ పరుగులో లక్ష్మణ్ తో పాటు ఇటీవలే ఎవరెస్ట్ అధిరోహించిన పూర్ణ, ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయరాదని అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాజారామ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా హాజరయ్యారు.

More Telugu News