రాష్ట్రానికి అదనపు మెడికల్ సీట్ల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ కు అదనంగా 450 మెడికల్ సీట్లు దక్కినట్టు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 150 సీట్లు తిరుపతిలోని స్విమ్స్ కు మంజూరు అయ్యాయని, మిగతా 300 సీట్లను ప్రైవేటు కాలేజీలకు కేటాయిస్తామని వివరించారు. కాగా, ఎంసీఐ రద్దు చేసిన 350 సీట్లను సాధించుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎంసీఐ రాష్ట్రంలోని కళాశాలల్లో తనిఖీలు చేస్తే రద్దయిన సీట్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆ దిశగా తనిఖీలు చేయాలని ఎంసీఐని కోరతామని చెప్పారు.