ప్రజలు డీటీహెచ్ లను ఆశ్రయిస్తే... నష్టపోయేది మీరే: ఎంఎస్ వో లకు పొన్నాల హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రజలు డీటీహెచ్ లను ఆశ్రయిస్తే... నష్టపోయేది మీరే: ఎంఎస్ వో లకు పొన్నాల హెచ్చరిక

తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను ఎంఎస్ వోలు నిలిపివేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తప్పుబట్టారు. ఈ చానళ్లను ఎంఎస్ వోలు వెంటనే ప్రసారం చేయాలని సూచించారు. ఏయే చానళ్లను చూడాలనేది ప్రజల సొంత నిర్ణయమని చెప్పారు. ఈ సమస్యను ఇక్కడితో వదిలి వేయాలని... మరింత జటిలం చేయరాదని అన్నారు. సమస్య ఇలాగే కొనసాగితే... ప్రజలు డీటీహెచ్ ల వైపు మొగ్గుచూపుతారని... అప్పుడు నష్టపోయేది కేబుల్ ఆపరేటర్లేనని హెచ్చరించారు.

More Telugu News