టీవీ9, ఏబీఎన్ ప్రసారాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తా: టీ.స్పీకర్
తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీనిపై జర్నలిస్టులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రసారాలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, ప్రసారాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో మీడియా కూడా పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు.