రెండో వన్డే 41 ఓవర్లకు కుదింపు... భారత్ 29/3
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో వన్డే 41 ఓవర్లకు కుదింపు... భారత్ 29/3

భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మిర్పూర్ లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 5.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 14 పరుగులు చేసిన సమయంలో వర్షం కురిసింది. వర్షం ఆగిపోయి మళ్లీ మ్యాచ్ ప్రారంభమయింది.

తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ త్వరత్వరగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 9.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఊతప్ప (14), రాయుడు (1) ఔటయ్యారు. ప్రస్తుతం పుజారా, రైనా క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ రహానే డకౌట్ అయ్యాడు.

More Telugu News