శ్రీవారికి రూ.32 లక్షలు ఖరీదు చేసే స్వర్ణకాసుల హారం కానుక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారికి రూ.32 లక్షలు ఖరీదు చేసే స్వర్ణకాసుల హారం కానుక

తిరుమల శ్రీవారికి శ్రీరంగం పీఠాధిపతి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామి స్వర్ణకాసుల హారాన్ని బహూకరించారు. ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం రామానుజజీయర్ స్వామి రూ.32 లక్షల విలువైన బంగారు కాసుల హారాన్ని టీటీడీ ఆలయ ఈవో గోపాల్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జీయర్ స్వామిని శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు.

More Telugu News