Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీ నోట దేశీ పిజ్జా విజయ గాథ

సోమవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ మహిళా సంఘం వార్షిక సమావేశంలో మోడీ దేశీయ పిజ్జా సక్సెస్ స్టోరీని చెప్పారు. మహిళలను తక్కువగా చూసే కాలం చెల్లిపోయిందంటూ పురుషులు కంటే మహిళలే ముందంజలో ఉన్నారని అన్నారు. మహిళల సత్తాకు ఉదాహరణగా అహ్మదాబాద్ లో ప్రజాదరణకు నోచుకున్న జాసుబెన్ పిజ్జాను పేర్కొన్నారు.

గుజరాత్ లో ఎక్కువ మంది పిజ్జాహట్, ఇతర మల్టీనేషనల్ పిజ్జా రెస్టారెంట్ల కంటే జాసుబెన్ తయారు చేస్తున్న దేశీయ పిజ్జా తినడానికే ఆసక్తి చూపిస్తారని, మహిళా విజయానికే ఇది నిదర్శనమని మోడీ చెప్పారు. మోడీ చెప్పిన జాసుబెన్ పిజ్జా 40ఏళ్లుగా అహ్మదాబాద్ లో ప్రజాదరణకు నోచుకుంటోంది. ఇక్కడ 50రూపాయలకే పిజ్జా లభిస్తుంటే విదేశీ పిజ్జాలు మాత్రం 100 పెట్టందే రావడం లేదు. జాసుబెన్ పిజ్జా విజయంలో ఇదీ ఒక కారణం!

More Telugu News