Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టాప్ లెస్' నిరసనతో పుతిన్ కు స్వాగతం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నేడు జర్మనీలో విచిత్ర రీతిలో నిరసన ఎదురైంది. పుతిన్ ను ఓ నియంతగా పేర్కొంటూ కొందరు యువతులు 'టాప్ లెస్' గా నిరసన వ్యక్తం చేశారు. పుతిన్ ఓ ఇండస్ట్రియల్ ఫెయిర్ లో పాల్గొనేందుకు జర్మనీ వచ్చారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి ఆయన ఫోక్స్ వాగన్ సరికొత్త మోడల్ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆ కార్యక్రమం జరుగుతున్న వేదిక వెలుపల పలువురు యువతులు ఛాతీపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా, రాయడానికి వీల్లేని భాషలో పుతిన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబ్ మహిళల పట్ల ఇస్లామిక్ వాదుల వైఖరిని నిరసిస్తూ గత వారం యూరప్ అంతటా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, రష్యాలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం కఠినంగా అణిచివేయడమే, పుతిన్ కు జర్మనీలో 'టాప్ లెస్' నిరసనకు కారణమని తెలుస్తోంది.

More Telugu News