Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫుల్ బాటిల్ తాగుతామన్నారు... కళ్లు తేలేశారు!

చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా? అంటూ పల్లెల్లో ఎవరైనా రెచ్చగొడితే పందేలు కాయడం మామూలే. పందెపు రాయుళ్లు అందులో గెలిచి మీసాలు మెలేసి మగతనాన్ని చాటుకోవడం సర్వసాధారణం. అలా సరదాకి కాసిన పందెం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు బలికొంది. మరో ఇద్దర్ని కోమాలోకి నెట్టింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలో రవి అనే వ్యక్తి 15 నిమిషాల్లో ఫుల్ బాటిల్ మద్యం తాగుతానంటూ మిత్రులతో పందెం కాశాడు.

అన్నదే తడవుగా తక్కువ సమయంలోనే మద్యం తాగుతూ రవి మృతి చెందాడు. ఇదే పందెంలో మరో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతూ కోమాలోకి వెళ్లిపోయారు. వీరిద్దరికీ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సరదా కోసం పందెం కాసి మృత్యువాత పడడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News