రాజస్థాన్ లో వెలుగుచూసిన అంబులెన్స్ ల కుంభకోణం
రాజస్థాన్ లో అంబులెన్స్ ల కుంభకోణం బయటపడింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద అంబులెన్సుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డవారిపై సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ ఫైలట్, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, మరో మాజీ మంత్రి వాయలార్ రవి కుమారుడు రవి క్రిష్ణలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ స్కాంలో దర్యాప్తు కొనసాగుతోంది.