బాబు కేబినెట్లో ఇద్దరు బీజేపీ మంత్రులు
చంద్రబాబు కేబినెట్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఇద్దరికి కేబినెట్ లో బెర్త్ దొరికింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న బీజేపీ ఎమ్మెల్యేలలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు, కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఉన్నారు.