ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు వీరే
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పకు పదవులు దక్కనున్నాయి. వీరి పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు చంద్రబాబు కాకుండా 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ, వాస్తవానికి 19 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది.