Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు ఆ ఉల్క పడితే ఒక మహానగరం నాశనమే!

వేయి అడుగుల ఆస్టరాయిడ్ (ఉల్క లాంటిది) ఒకటి రేపు భూమికి అత్యంత దగ్గరగా రానుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దగ్గరగా అంటే భూమికి 1.25 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి అది వెళ్తుంది. ఈ ఉల్క గంటకు 50 వేల 400 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ ఆస్టరాయిడ్ భూమి మీదపడితే ఒక మహానగరం నాశనమైపోతుందని, అంతటి శక్తి దీనికి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఇదిలా ఉంచితే, సైన్సు చెబుతున్నట్టు భూమి సూర్యుడి నుంచి విడిపోలేదని, దేవుడి సృష్టేనని 40 శాతం మంది అమెరికన్లు విశ్వసిస్తున్నారు. ప్రతి పది మందిలో నలుగురు భూమిని పది వేల సంవత్సరాల క్రితం దేవుడు సృష్టించారని నమ్ముతున్నారు.

More Telugu News