ఐదుగురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐదుగురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత

ఐదుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రేమండ్ పీటర్, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ మిశ్రా, పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పూనం మాలకొండయ్య, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా జనార్ధన్ రెడ్డిలకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

More Telugu News