త్వరలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కేటీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: కేటీఆర్

త్వరలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళతారని, ఆయన స్వయంగా ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఈ వేడుకలకు ఆహ్వానిస్తారని కేటీఆర్ చెప్పారు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన... కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలే కోరుకుంటున్నామని అన్నారు.

More Telugu News