పోలవరం ముంపు ప్రాంతాల్లో రేపు రహదారిని మూసేస్తున్నారు
ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతాన్ని కలిపే రహదారిని రేపు మూసేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో శనివారం నాడు రహదారి దిగ్బంధం చేయాలంటూ అఖిలపక్షం పిలుపునిచ్చింది. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది.